Srikaram News
క్రైమ్తెలంగాణ

ఓవైసీ నగర్‌లో పోలీసుల మెరుపు దాడి – బెట్టింగ్ రాయుడు పట్టివేత

– ఎఎస్పీ అవినాష్ కుమార్ నేతృత్వములో రాత్రి వేళల్లో పోలీసుల ఉచ్చు
– బెట్టింగ్ రాయుడుని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలింపు
– నగదు,బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం
– స్టిరాస్థుల గుర్తింపు, పత్రాల సీజ్

భైంసా ( శ్రీకరం న్యూస్): నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్‌లో గురువారం రాత్రివేళలో పోలీసులు అకస్మాత్తుగా దాడి చేసి బెట్టింగ్ రాయుడి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు భైంసా ఏ ఎస్ పి అవినాష్ కుమార్ నేతృత్వంలో భైంసా టౌన్ సిఐ గోపీనాథ్ ఆధ్వర్యంలోని స్థానిక పోలీసులు, ప్రత్యేక బృందంతో ముట్టడి చేసి చర్యలు చేపట్టారు.
* పోలీసుల ఉచ్చు…
క్రికెట్ మ్యాచ్‌లపై స్లాట్లు , పందాలు నిర్వహిస్తున్న సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడి జరిపారు. ఈ దాడిలో అక్కడి ప్రాంతములోని ప్రధాన నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, పందేల రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిసింది. అంతేకాకుండా బెట్టింగు రాయుడు ఇంట్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో నగదుతో పాటు బంగారు ఆభరణాలు, స్టిరాస్థుల పత్రాలు గుర్తించి వాటిని సైతం స్వాదీన పర్చుకున్నట్లుగా సమాచారం.
* కేసు నమోదు..
అదుపులోకి తీసుకున్న బెట్టింగ్ రాయుడిపై గ్యాంబ్లింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ రాకెట్ వెనుక ఉన్న ఇతరులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లుగా సమాచారం.

0Shares

Related posts

సభ్యత్వ నమోదులో శభాష్..!

Srikaram News

భైంసా ఆలయాల్లో వరుస చోరిలకు పాల్పడుతున్న దొంగ పట్టివేత

Srikaram News

పర్యావరణ హితం.. భైంసా ఆర్యవైశ్య మండలి అభిమతం

Srikaram News

ఏరియా ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పిట్ల శ్రీనివాస్ ఆకస్మిక మృతి

Srikaram News

కన్నుల పండువగా సామూహిక హనుమాన్ చాలీసా పఠనోత్సవం

Srikaram News

మరో గంటన్నర వ్యవదిలో బైంసాకు చేరుకోనున్న యాత్రీకుల బృందం

Srikaram News

Leave a Comment