Srikaram News
తెలంగాణ

భైంసాలో మృతదేహ భద్రపాటుకు ఫ్రీజర్ సేవలు

– అందుబాటులోకి తీసుకవచ్చిన డా. ముత్యంరెడ్డి
– మాతృమూర్తి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం

భైంసా (శ్రీకరం న్యూస్) ; తన తల్లి ప్రథమ సంవత్సరికాన్ని పురస్కరించుకొని భైంసా పట్టణంలోని శ్రీ సాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ముత్యం రెడ్డి కుటుంబీకులు ఒక ప్రత్యేక సేవను శనివారం అందుబాటులోకి తెచ్చారు. మృతదేహాన్ని భద్రపరచేందుకు అవసరమైన ఫ్రీజర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంచారు. మాతృమూర్తి జ్ఞాపకార్థంగా ప్రారంభించిన ఈ సదుపాయం స్థానికులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు, వైద్యవర్గాలు పేర్కొన్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చే బంధువుల రాకపోకల్లో ఆలస్యం కలిగిన సందర్భాల్లో మృతదేహాన్ని గౌరవప్రదంగా భద్రపరచుకునేందుకు ఇది ఎంతో తోడ్పడనుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ముత్యం రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ – “మా తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలన్న ఆశయంతో, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సేవను ప్రారంభించాం. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతాం” అని తెలిపారు. ఫ్రీజర్ సేవలు అవసరమున్న వారు 9441375375, 6300854960 మోబైల్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఫ్రీజర్ సేవలను అందుబాటులోకి తెచ్చిన డా. ముత్యంరెడ్డిని భైంసా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కదం మోహన్ రావ్ పాటిల్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండెపు కాశీనాథ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చందులాల్, బీజేపీ పట్టణ కమిటి అధ్యక్షులు రావుల రాము, మాజీ అధ్యక్షులు గాలి రవితో పాటు పలువురు అభినందిస్తూ డా. ముత్యంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

0Shares

Related posts

రోడ్డు ప్రమాదంలో విఠాపూర్ వాసి దుర్మరణం

Srikaram News

బీజేపీలో ముసలం

Srikaram News

రోడ్డు ప్రమాదంలో మహాగాం గ్రామవాసి దుర్మరణం

Srikaram News

ఓవైసీ నగర్‌లో పోలీసుల మెరుపు దాడి – బెట్టింగ్ రాయుడు పట్టివేత

Srikaram News

ప్రాణమున్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతా

Srikaram News

బిగ్ బ్రేకింగ్ న్యూస్ : గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

Srikaram News

Leave a Comment