– పుట్టిన గంటకే తీవ్ర అనారోగ్యపు సమస్యలు
– మూడు అనుపత్రుల్లో శిశువు రక్షణ వైద్యుల ముమ్మర చర్యలు
– కానరాని ఫలితం- తనువు చాలించిన శిశువు
– బైంసాలో ఘటన- బాధిత కుటుంబం సాలాపూర్(బాసర)
భైంసా (శ్రీకరం న్యూస్), మున్సిపల్ కేంద్రమైన భైంసాలో శనివారం విషాదకరమైన దుర్ఘటన చోటు చేసుకుంది జన్మించిన రెండు రోజులు కూడా గడవక ముందే ఒక పసికందు ప్రాణం కోల్పోయింది. పుట్టిన గంటకే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న పసికందును రక్షించేందుకు వైద్యులు మెరుగైన రీతిలో చికిత్సలు అందించినా ఫలితం కానరాలేదు.. శిశువు గుండె చప్పుడు అగిపోయి తిరిగిరాని లోకాలకు తరలిపోయింది. తల్లితండ్రులు, కుటుoబీకులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. విషాద ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాసర మండలంలోని సాలాపూర్ గ్రామానికి చెందిన పూజ అనే గర్భిణీ పురుటి నొప్పులతో బాదపడుతుండటంతో కుటుంబీకులు రెండవ ప్రసవ నిమిత్తం గురువారం ఉదయం 10 గంటల సమయంలో భైంసాలోని ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యాధికారిణులు గర్భిణీకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స నిర్వహించగా ఆడబిడ్డను ప్రసవించింది. తొలి కాన్సులో ఆడ శిశువు జన్మించగా మలికాన్పు లో సైతం ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే శిశువు పుట్టిన గంట వ్యవధిలోనే ఆనారోగ్యం సమస్య బారిన పడి అస్వస్థత చెందింది. శిశువు ఆరోగ్య సమస్య గుర్తించిన ఏరియా ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది స్థానికంగా అన్ని రకాల చికిత్సలు నిర్వహించారు. శిశువు ఆరోగ్య రక్షణకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరమున్న దృష్ట్వా పెద్ద ఆసుపత్రికి తీసుకవెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబీకులు శిశువును ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి శిశువును తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు చికిత్సలు నిర్వహించినప్పటికి శిశువు ఆరోగ్యం కుదుటపడలేదు. ఊపిరితిత్తులపై ఒత్తిడి అధికంగా ఉండటం మూలంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా పూర్తి స్థాయి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ కు తరలించాలని సదరు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు బాధిత కుటుంబానికి సూచించారు. దీంతో కుటుంబీకులు శిశువును శుక్రవారం ఉదయం వేళలో భైంసా నుంచి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహింపచేశారు. అక్కడ కూడా శిశువు ఆరోగ్యం ఎంత మాత్రం మెరుగు కాకపోగా ఇంతకింతకి క్షిణిస్తూ పోయింది. దీంతో శనివారం ఉదయం వేళలో అక్కడి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ప్రాణాపాయకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపినట్లుగా బాధిత కుటుంబీకులు వెల్లడించారు. మరోమా. రం కానరాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శిశువును తిరిగి నిజామాబాద్ నుంచి బైంసాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించుక వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇక్కడ చికిత్సలు అందిస్తున్న సమయంలో శిశువు మృతి చెందినట్లుగా కన్నిటి పర్యంతమవుతూ వెల్లడించారు. భైంసా ఏరియా ఆసుపత్రితో పాటు ఇక్కడి నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు శిశువు ఆరోగ్యం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవ్వమవ్వడంతో శిశువు ప్రాణాలు కాపాడలేక పోయారు. దీంతో తనువు చాలించిన శిశువుకు రెండు రోజులకే నూరేళ్లు నిండిపోయాయి.
– కన్నీరుమున్నీరై విలపించిన కుటుంబీకులు….*
అనారోగ్యపు సమస్యతో మృతి చెందిన పసికందు మృతదేహన్ని చూసిన కుటుంబీకులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రైవేట్ ఆసుపత్రి నుంచి పసికందు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తీసుకవచ్చిన కుటుంబీకులు బందువులు వచ్చేంత వరకు అక్కడ ఆగారు. అనంతరం వారందరూ కలిసి శిశువు మృతదేహంతో స్వగ్రామమైన సాలాపూర్ కు వెళ్లిపోయారు ఆసుపత్రిలోనున్న శిశువు తల్లికి సంబంధిత విషయం తెలియనీయకుండా కుటుంబీకులు చర్యలు చేపట్టారు. ఐదుగురు కుటుంబీకులు, బంధువులు అంత్యక్రియలకు వెళ్లకుండా మృత శిశువు తల్లి వద్దనే ఉండిపోయారు. తండ్రితో సహా మిగతా వారందరూ అంత్యక్రియలకు తరలిపోయారు.