– భక్తుల సౌలభ్యం కోసం ప్రభుత్వ నిర్ణయం
– అనుమతి తీసుకున్న మండపాలకు మాత్రమే
– దుర్గామాత మండపాలకు సైతం ఉచిత విద్యుత్ వసతి
బైంసా,(శ్రీకరం న్యూస్) వినాయక చవితి వేడుకలు సమీపించిన నేపథ్యంలో గణేష్ మండలీలకు ప్రభుత్వం శుభ సమాచారాన్ని అందించింది.
రానున్న చవితి వేడుకలను పురస్కరించుకొని గణేష్ మండలీలన్నింటికి ఉచితంగా విద్యుత్ ను అందించనున్నట్లుగా ప్రకటించింది. ఆనుమతి పొందిన ప్రతి గణేష్ మండపానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ వ్యవస్థను కల్పించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకొని ప్రక టించింది. మండలీల సౌలభ్యం కోసం గాను ప్రభుత్వం ఉచిత విద్యుత్ వసతి కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం ద్వారా మండపాల నిర్వాహకులకు
విద్యుత్ బిల్లుల భారం దూరం కానుంది. ప్రతియేడాది గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు విద్యుత్ కనెక్షన్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ సారి పత్యేక సదుపాయం కల్పిస్తూ ఉచితంగా విద్యుత్ అందించాలని విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. గణేష్ మండలీలకే కాకుండా రానున్న దుర్గామాత మండలీలకు సైతం ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్ నిర్ణయం పట్ల గణేష్ మండలీలు సంతృప్తిని వ్యక్తం చేశాయి.