– జలమయమైన మంచిర్యాల్ చౌరస్తా ప్రాంతం
– లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వస్తున్న వర్షపు నీరు
– అతలాకుతలం అవుతున్న జనం
– ఇంకా భారీ వర్ష సూచనతో బేంబేలు
బైంసా, (శ్రీకరం న్యూస్): జిల్లా కేంద్రమైన నిర్మల్ లో బుధవారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షంతో జిల్లా కేంద్రంలో పరిస్థితి అతలాకుతలం అవుతోంది. ఎక్కడ చూసిన వరద నీటి ప్రవాహమే కనిపిస్తోంది. మంచిర్యాల్ చౌరస్తా, శాంతినగర్ చౌరస్తా, తిరుమల థియేటర్ రోడ్డు మార్గా లన్నీ జలమయమయ్యాయి. మోకాలిలోతు కంటై పై భాగంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకల నిర్వహణ కు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.ఇక వైఎస్ఆర్ కాలనీలో పలు ప్రాంతాలు నీట మునిగినట్లుగా సమాచారం.జీఎన్అర్ కాలనీకు ముంపు బెడద పొంచి ఉన్నట్లుగా తెలిసింది. జిల్లా కేంద్రంలోని అధిక శాతం రోడ్లపై వరద నీరు ఉదృతి ప్రవహిస్తుండటం మూలంగా సమస్యలు తలెత్తాయి. మురికి కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించే స్థితికి చేరుకున్నాయి, ఆయా కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లోని పలు నివాస గృహల్లోకి వరద నీరు వసుoడటంతో ఆయా ప్రాంతాలవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. వాతవరణ శాఖ గురువారం కూడా భారీ వ ర్షాలు కురుస్తాయని ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కేంద్రవాసులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్ని ప్రభుత్వ శాఖాధికారులను అప్రమత్తం చేసి భారీ వర్షాల మూలంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లకు ండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఎన్టీఅర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లా ఎస్పీ డా.జానకీ షర్కిల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేసింది. పోలీసులు జలమయమైన రోడ్లపై ఎ లాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను చర్యలను వేగవంతం చేశారు.