– అందకూర్ అలుగు వద్ద భారీగా కోతకు గురైన రహదారి
– రాకపోకలు నిలిచిపోయే పరిస్థితులు
భైంసా (శ్రీకరం న్యూస్ ) ; భైంసా డివిజన్ పరిధిలోని కల్లూర్–కుంటాల రహదారి మార్గం ప్రమాదకరంగా మారింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో రహదారి మార్గంలోని అందకూర్ అలుగు ఉధృతంగా ప్రవహించడం మూలంగా అక్కడి ప్రాంతంలోని రోడ్డు భారీ పరిమాణంతో కోతకు గురైంది. రోడ్డుకు ఒక వైపు అధిక భాగం కోతకు గురి కావడం మూలంగా రాకపోకలకు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు వంతెనపై భారీ బుంగ ఏర్పడింది. దీంతో ద్విచక్రవాహానాలు, ఆటోలు మినహా ఇతర వాహనాల రాకపోకలు చేపట్టే పరిస్థితులు లేకుండా పోయాయి. వర్షం పరిస్థితి ఇలాగే కొనసాగితే కల్లూర్–కుంటాల రోడ్డు మార్గంలో పూర్తి స్థాయిలో రవాణాకు ఆటంకం కలిగే పరిస్థితులున్నాయి. అంతే కాకుండా ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచే పరిస్థితులు నెలకొని ఉన్నాయి.