– కుండపోత వర్షాలతో అంతటా అతలాకుతలం
– జిల్లాలో సగటు వర్షపాతం 133 మి.మీ…
భైంసా (శ్రీకరం, న్యూస్) ;
నిర్మల్ జిల్లాను వరుణ దేవుడు కుమ్మేశాడు. బుధవారం మొదలుకొని గురువారం వరకు అల్పాపీడన ప్రభావంతో జిల్లా అంతటా కుండపోత వర్షం కురిసింది. గురువారం జిల్లా మొత్తంలో 2527.4 మి,మీటర్ల వర్షం కురువగా, సగటు 133. మి,మీ. వర్షపాతం నమోదైంది. నిర్మల్ పట్టణ పరిధిలో 332.8 మి.మీ, నిర్మల్ మండలంలో 332.4 మి,మీ, లక్ష్మణచాంద 218.6, సోన్ 208.4, నర్సాపూర్ (జీ) 202.6, సారంగపూర్ 187.2, కుంటాల 165.4, దిలావర్పూర్ 164.4, లోకేశ్వరం 125.2, దస్తూరాబాద్ 115.4, ఖానాపూర్ 80.8, మామడ78.4, కడెం 74.4, పెంబి 51.4, భైంసా 44.6, ముథోల్ 39.2, తానూరు 38.2, బాసర 38, కుబీర్ 10 మి.మీటర్లు కురిసింది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిప్రవహిస్తుండగా, చెరువులు పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. పల్లె, పట్టణాల్లో తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మురికి కాలువలు పొంగి ప్రవహిస్తుండడంతో పారిశుధ్య సమస్యలు నెలకొన్నాయి.