– ఆదర్శంగా నిలుస్తున్న కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డా. జానకి షర్మిలల చర్యలు
– భారీ వర్షాలు, వరదలు లెక్కచేయకుండా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు
– జనాలను అప్రమత్తం చేస్తూ స్వయంగా సహాయక చర్యలు
– అధికారులను సమన్వయం చేస్తూ వేగంగా వరద నష్ట నివారణ చర్యలు
బైంసా, (శ్రీకరం న్యూస్) ;
ప్రకృతి పరిహసం చేస్తున్న వేళ.. జల విలయంతో ముంపు బెడద పొంచి ఉన్న ప్రభావిత ప్రాంతాల జనం ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎలాంటి ఉపద్రవ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందన్న ఆందోళనలతో సతమతమవుతున్నారు. ఇలాంటి విపత్కర స్థితి, ప్రమాదకర పరిస్థితుల్లో జిల్లా ఉన్నతస్థాయిలోని మహిళాధికారులిద్దరు సాహసోపేత సేవలు, చర్యలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రత్యక్ష, పరోక్ష సేవలతో మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ముంపు బెడద, ప్రభావిత ప్రాంతాలవాసులను జాగృతపరుస్తూ భయాందోళనలను విడనాడి మనోధైర్యం కలిగేలా చైతన్యపరుస్తున్నారు. వీరిరువురే జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డా.జానకి షర్మిలలు. బుధవారం సాయంత్రం నుంచి జిల్లా కేంద్రమైన నిర్మల్ తో పాటు జిల్లాలోని అధిక శాతం ప్రాంతాల్లో కుండపోత వర్షంతో ముంపు బెడద ఏర్పడింది. జిల్లా కేంద్రంలో పరిస్థితి అతలాకుతలమయ్యింది. లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రోడ్లు జలమయమయ్యి చెరువులను తలపించే స్థితికి చేరుకున్నాయి.పలు కాలనీలు జలమయమయ్యాయి. నివాస గృహాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. చెరువులు, కుంటలు నిండుకపోయి ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. ఎడతెరపి లేకుండా వరుణుడి జోరు కొనసాగింది. ఇలాంటి ఉపద్రవ వేళ జిల్లా కలె ర్ అభిలాష అబినవ్, ఎస్పీ డా.జానకీ షర్మిలలు ముంపు ప్రభావిత, బెడద పొంచి ఉన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టారు. దినం,రాత్రి అనే తేడా లేకుండా భారీ వర్షాలను వరదలను. ప్రమాదకర పరిస్థితులను లె క్కచేయకుండా సమస్య నెలకొని ప్రాంతాల్లో సాహసోపేతంగా పర్యటించారు. స్వయంగా పరిస్థితులను పరిశీలిస్తూ అక్కడి ప్రాంతాలవాసులను జాగృతం చేస్తూ సేవలందించారు. మహిళాదికారులిద్దరు ప్రభుత్వశాఖాధికారుల మధ్య నమ స్వయం చేస్తూ సహాయ సేవలు, నష్ట నివారణ చర్యలు వేగవంతమైన రీతిలో జరిగేలా చురుకుగా వ్యవహరించారు. కొన్ని సందర్భాల్లో అధికారులిద్దరు కలిసి, మరికొన్ని సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరుగా వరద ప్రభా విత, బెడద ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టి అప్రమత్త రక్షణ చర్యలను చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారిలిద్దరు స్వయంగా క్షేత్ర స్థాయిలో సేవలు అందిస్తుండటం, జాగృతం చేస్తుండటాన్ని వివిధ ప్రభుత్వ శాఖాధికారులు మార్గదర్శకoగా తీసుకొని తాము సైతం ఆదర్శవంతమైన రీతిలో విధుల నిర్వహణలో నిమగ్నమయ్యాయి. మహిళా ఉన్నతాధికారులిద్దరి సేవలు అందరిచే ప్రశంసలు పొందుతున్నాయి.