– రెండున్నర గంటల్లో 15, 500 క్యూసెక్కులు పెరిగిన ఇన్ ఫ్లో
– ఉదయం నాలుగు గంటలకు 5 వేలు, ప్రస్తుతం 20,500 క్యూసెక్కులు
– సుద్దవాగులోకి 20,500 క్యూసెక్కుల వరద నీటి వదిలివేత
– ఇంతకింతకి పెరుగుతున్న ఇన్ ఫ్లో
– కాసేపట్లో నాలుగో వరద గేట్ తెరిచే పరిస్థితులు
బైంసా,(శ్రీకరం న్యూస్) ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తు తోంది. వేకువ జాము 4 గంటల ప్రాంతంలో ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 5 వేల క్యూసెక్కులు ఉండగా రెండు గంటల అనంతంరం ఆరు గంటల సమయంలో ఇన్ ఫ్లో ఎకంగా 15,500 క్యూసెక్కులు పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 20,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమం లో వేకువ జాము వేళలో ఇన్ ఫ్లో కు అనుగుణంగా ఒక వరద గేట్ ద్వారా దిగువన ఉన్న సుద్దవాగులోకి 6,500 క్యూసెక్కుల వరద నీటిని వదిలి పెట్టిన అధికారులు ప్రస్తుతం పెరుగుతున్న ఇన్ ఫ్లో పరిస్థితుల దృష్ట్యా మరో రెండు వరద గేట్ల ఎత్తివేసి మొత్తం మూడు వరద గేట్ల ద్వారా సుద్ద వాగులోకి 20,500 క్యూసెక్కుల వరద నీటిని వదిలిపెట్టారు. అయితే ఎగువననున్న మహారాష్ట్రలో కురుస్తున్న జోరు వానల నేపథ్యంలో ప్రాజెక్టు లోకి ఇన్ ఫ్లో ఇంతకింతకి పెరుగుతూ పోతోంది. ప్రాజెక్టు నిర్వాహణాధికారులు తెలిపిన వివరాల ప్రకారం 6.30 ప్రాంతంలో ఇన్ ఫ్లో 23 వేల క్యూసెక్కులకు చేరుకున్నట్లుగా తెలిసింది. దీంతో ఇన్ ఫ్లో కు అనుగుణంగా కాసేపట్లో నాలుగవ వరద గేట్ ను కూడా ఎత్తివేయనున్నట్లుగా సమాచారం. సుద్దవాగులోకి 20,500 క్యూసెక్కుల వరద నీటిని వదిలిన నేపథ్యంలో భైంసాలోని సుద్దవాగు బైపాస్ రోడ్డు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.