– ఇన్ ఫ్లో 25 వేల క్యూసెక్కులు
– అవుట్ ఫ్లో 25 వేల క్యూసెక్కులు
– నీటి మునిగిన సుద్దవాగు బైపాస్ రోడ్డు వంతెన
– నిలిచిన రాకపోకలు
– బస్ డిపో కు పొంచి ఉన్న ముంపు బెడద
– ఇంతకి ఇంతకీ పెరుగుతున్న ఇన్ ఫ్లో
– ఐదవ గేట్ ఎత్తివేసేందుకు నెలకొన్న పరిస్థితిలు
భైంసా ( శ్రీకరం న్యూస్) : గడ్డేన్న వాగు ప్రాజెక్టులోకి వరదనీరు పోటెత్తుతోంది . ఉదయం నాలుగు గంటల నుంచి ఇన్ఫ్లో పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 25 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా అంతే మొత్తంలో వరద నీటిని దిగువనున్న సుద్ధ వాగులోకి వదిలిపెట్టారు. ఇన్ఫ్లో కు అనుగుణంగా 6 గంటల సమయంలో మూడు వరద గేట్లను ఎత్తివేసిన అధికారులు ఇన్ఫ్లో 20,500 క్యూసెక్కుల నుండి 25 వేల క్యూసెక్కులకు ఎగబాకడముతో మరో వరద గేటు ఎత్తివేసి 4 వరద గేట్ల ద్వారా సుద్ద వాగు కులోకి 25వేల క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. ఇన్ఫ్లో పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో ఐదవ వరద గేటును ఎత్తే పరిస్థితులు నెలకొన్నాయని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. 25,000 క్యూసెక్కుల వరద నీటి విడుదలతో సుద్ధ వాగు పరిసర ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. సుద్దవాగు బైపాస్ రోడ్డు వంతెన పూర్తిగా నీటి మునగడంతో ఆ రోడ్డు మార్గం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. సుద్దవాగు సమీపంలోని శివాలయం జలమయమైంది. అక్కడి రోడ్డు మొత్తం రాకపోకలు చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. సుద్ద వాగు బైపాస్ రోడ్డు వంతెన నీటి అమ్ములుడంతో అక్కడి ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలు కళ్యాణమంటపాలకు ముంపు బెడద పొంచి ఉంది. క్రమంలో బస్ డిపోకు సైతం వరద నీటి ముంపు బెడద నెలకొంది. స్మశాన వాటిక పూర్తిస్థాయిలో నీట మునిగింది. ఐదో వరద గేటు ఎత్తివేస్తే పరిస్థితి మరింత అతలాకుతలమయ్యే స్థితి నెలకొంది.