– గడ్డెన్న ప్రాజెక్టు వరదతో నీట మునిగిన కుభీర్ రోడ్డు
– భైంసా సరిహద్దు హనుమాన్ విగ్రహాం వద్ద వరద
– నిలిచినపోయిన వాహనాలు
గడ్డెన్న వాగు ప్రాజెక్టు వరద నీటి విడుదలతో భైంసా పట్టణ శివారులోని కుభీర్ రోడ్డు మార్గం జలమయమైంది. ఈ క్రమంలో ఇక్కడి ప్రాంతం మీదుగా పాలజ్, కుభీర్, నిగ్వ తదితర ప్రాంతాలకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. గడ్డెన్న ప్రాజెక్టు నుంచి సుద్దవాగులోకి వదిలే నీరు అధిక మొత్తంలో కుభీర్ మార్గాన్ని ముంచేత్తింది. పట్టణ శివారులోని హనుమాన్ మఠం వద్దకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇక్కడి ప్రాంతం మీదుగా కుభీర్, పాలజ్, నిగ్వ తదితర ప్రాంతాలకు రాకపోకలు చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. రోడ్డుపైకి వరద నీరు ఇంతకింతకీ పెరుగుతుండడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. పాలజ్, తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలన్నీ పట్టణ శివారులోని భట్టిగల్లీ హనుమాన్ మఠం వద్దే బారులు తీరాయి. తెలంగాణ, మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులతో పాటు భక్తుల ప్రైవేటు వాహానాలన్నీ ఇక్కడే నిలిచిపోయాయి. గడ్డెన్న ప్రాజెక్టు వరద నీటి వదిలివేత తగ్గితే తప్పా వాహనాల రాకపోకలు చేపట్టడానికి వీలు లేకుండా ఉంది.