– ప్రస్తుత ఇన్ ఫ్లో 8 వేలు, అవుట్ ఫ్లో 20 వేల క్యూసెక్కులు
– ఒక గెట్ మూసివేత, 4 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి వదిలివేత
– ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.7మీటర్లు, ప్రస్తుతం 358.1 మీటర్లు
బైంసా, (శ్రీకరం న్యూస్) ఎగువ భాగంలోని మహారాష్ట్రలో వర్షపు జోరు తగ్గింది.
ఈ క్రమంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి మధ్యాహ్నం 12 గంటల సమయములో వరద నీటి ఇన్ ప్లో 43 వేల క్యూసెక్కులుగా ఉండగా రాత్రి 8.30 ప్రాంతంలో 8 వేలకు తగ్గుముఖం పట్టింది. ఇన్ ఫ్లో తగ్గిపోయిన నేపథ్యంలో వరద గేట్ల ద్వారా నీటి వదిలివేతను అధి కారులు తగ్గించి వేసారు. మధ్యాహ్నం ఎత్తిన ఐదు వరద గేట్లలో రాత్రి 8.30 ప్రాంతంలో ఒక వరద గేటును మూసివేసి 4 వరద గేట్ల ద్వారా నీటి వదిలివేతను కొనసాగించారు. మధ్యాహ్నం వేళలో 37 వేల క్యూసెక్కులుగానున్న అవుట్ ఫ్లో రా త్రి 8.30 ప్రాంతంలో 20 వేల క్యూసెక్కులకు పరిమితం చేశారు. ఇక అవుట్ ఫ్లో అధిక సమయం 37 వేల క్యూసెక్కులుగా కొనసాగిన పరిస్థితుల్లో ప్రాజెక్టు నీటి వ ట్టం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.7 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 358.1 మీటర్లకు తగ్గిపోయింది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 1.83 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 1.491టీఎం సీలుగా ఉంది. సుద్దవాగులోకి వరద నీటి విడుదల తగ్గిన నేపథ్యంలో భైంసా ప ట్టణ పరిధిలోని ఆయా ప్రాంతాలు జలమయం నుంచి క్రమక్రమంగా విముక్తి పొందుతూ సాధారణ స్థితికి చేరుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి.