– గణేషుని దర్శనానికి భారీగా తరలుతున్న భక్తులు
– బైంసా-పాలజ్ మార్గంలో క్యూ కట్టిన వాహనాలు
బైంసా (శ్రీకరం న్యూస్): గడ్డెన్నవాగు ప్రాజెక్టు వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో శనివారం వేకువ జాము నుంచి మహారాష్ట్రలోని పాలజ్ కు వాహనాల రాకపోకలు పున: ప్రా రంభమయ్యాయి. శుక్రవారం గడ్డెన్నవాగు ప్రాజెక్టు వరద ఉధృతితో బైంసా పట్టణ ప రిధిలోని వివిధ ప్రాంతాల రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలు చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. ప్రధానంగా భైంసాలోని భట్టిగల్లి హన్మాన్ మఠం మీదుగా వెళ్లే కుబీర్ రోడ్డు మొత్తం నీట మునిగింది. ఈ క్రమంలో ఇక్కడి మార్గం మీదుగా కుభీర్, పాలజ్, నిగ్వా తదితర ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పాలజ్ లోని గణేషుని దర్శనానికి బైంసా మీదుగా వెళ్లేందుకు తరలివచ్చిన వేలాది మంది భక్తులు వాహనాల రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో అసంతృప్తిగా వెను తిరిగిపోయారు. శుక్రవారం రాత్రి వేళలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు వరధ ఉదృతి గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో జలమయమైన రోడ్లన్నీ మెరుగయ్యాయి. వాహనాల రాకపోకలకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో శనివారం వేకువ జా ము వేళ నుంచి ఇక్కడి మార్గం మీదుగా వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పాలజ్ గణేషుని దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వెలుతున్నారు. బైంసా – పాలజ్ మార్గంలో వాహనాలు క్యూ కట్టాయి. తెలంగాణ, మహారాష్ట్ర అర్టీసీ బస్సులలో భక్తుల రద్దీ అధికంగా నెలకొంది.