– జనసందోహంతో కిటకిటలాడుతున్న ఆలయ పరిసరాలు
– భక్తులతో నిండుకపోయిన కంపార్ట్మెంట్లు
– బైంసా- పాలజ్ రోడ్డుమార్గంలో వాహనాల రద్దీ
బైంసా, (శ్రీకరం న్యూస్): రాష్ట్ర సరిహద్దులోని పాలజ్ సత్య గణేషుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద మొత్తంలో పాలజ్ కు క్యూ కట్టారు. వేకువ జాము వేళ నుంచే గణేష్ మందిరానికి భక్తుల తాకిడి మొదలయ్యియంది. ఈ క్రమంలో ఆలయ పరిసరాలన్నీ భక్త జన సందోహంతో నిండుకపో యాయి. దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ కిక్కిరిసిపోయాయి. ద ర్శనానికి గంటన్నర నుంచి రెండు గంటల వరకు సమయం పడుతోంది. ముడుపులు కట్టేందుకు గాను భక్తులు అమితాసక్తిని చూపుతున్నారు. ముడుపులు కట్టె విభాగాల వద్ద దినం, రాత్రి అనే తేడా లేకుండా భక్తులు బారులు తీరుతున్నారు. అన్నప్రసాద కేంద్రమంతా భక్తులతో నిండుకపోయింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వాహనాల ద్వారా ఇక్కడికి తరలివస్తుండటంతో బైంసా – పాలజ్ రోడ్డు మార్గమంతా వాహనాల రద్దీ నెలకొంది. బైంసా- పాలజ్ కు తెలంగాణ, మహారాష్ట్ర అర్టీసీ బస్సులు జోరుగా నడుస్తుండటంతో ప్రయాణీకులకు రవాణ సౌకర్యం సులువయ్యింది.