– భైంసా హిందూ ఉత్సవ సమితి, మార్కెట్ గణేష్ మండలి ఆధ్వర్యంలో కార్యక్రమం
– పఠనోత్సవంలో పాల్గొన్న 1008 మంది విద్యార్థులు
– భైంసా గాంధీ గంజ్ లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక వాతావరణం
భైంసా (శ్రీకరం న్యూస్) ;
మున్సిపల్ కేంద్రమైన భైంసాలోని గాంధీ గంజ్ ఆవరణంతా హనుమాన్ చాలీసా పఠనోత్సవంతో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. వినాయక చవితి వేడుకలలో భాగంగా హిందూ ఉత్సవ సమితి, వ్యవసాయ మార్కెట్ గణేష్ మండలి సంయుక్తంగా గాంధీ గంజ్ ఆవరణలో సామూహిక హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో భైంసా పట్టణ పరిధిలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన 1008 మంది విద్యార్థులు ఏకస్వరంతో హనుమాన్ చాలీసా జపం చేసి భక్తితరంగాలతో పరవశింపజేశారు. విద్యార్థుల సముహా గణంతో గాంధీ గంజ్ పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన హిందూ ఉత్సవ సమితి శ్రేణులు వ్యవసాయ మార్కెట్ గణేష్ మండలి సభ్యులు, గణేష్ మండలిల ప్రతినిధులు, భక్తులు హనుమాన్ చాలీసా పఠనంలో లీనమైవినాయకుని మహిమను కీర్తిస్తూ ఉత్సాహాభరితంగా పాల్గొన్నారు. సమాజంలో భక్తి భావాలను ఆధ్యాత్మికతలను సత్ సంకల్పాలను పెంపొందించేందుకు గాను వినాయక చవితి వేడుకలను ప్రత్యేక కార్యక్రమాల నిర్వాహాణకు చర్యలు చేపట్టామని హిందూ ఉత్సవ సమితి, వ్యవసాయ మార్కెట్ గణేష్ మండలి కమిటి ప్రతినిధులు వెల్లడించారు.