భైంసా (శ్రీకరం న్యూస్) : నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గురువారం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి సితక్క లు ఆయనకు పార్టీ ఖండువా వేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలతో ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పలు చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ లో చేరారు.

previous post