@,వైస్ చైర్మెన్ గా ఫారుఖ్ ఆహ్మద్
@ విధేయులకు దక్కిన పీఠాలు
@ ఆరు నెలల ఉత్కంఠతకు తెర
ఎట్టకేలకు భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం కమిటీ నియామకం జరిగింది. గత ఆరు నెలలుగా కమిటీ నియామకం పై కొనసాతున్న ఉత్కంఠతకు తెరపడింది. కమిటీ చైర్మెన్ గా సిందే ఆనంద్ రావ్ పాటిల్, వైస్ చైర్మెన్ ఫారుఖ్ ఆహ్మద్ లు నియమింపబడ్డారు. పార్టీకి వీర విధేయుడి
గానున్న సిందే ఆనందరావ్ పాటిల్ కాంగ్రెస్ అధిష్టానం మార్కెట్ కమిటీ చైర్మెన్ స్థానం కట్టబెట్టింది.ఇక ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి విధే యుడిగా, ప్రధాన అనుచరుడిగానున్న ఫారుఖ్ ఆహ్మద్ కు మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ పదవి వరించింది. గత అర్ధ సంవత్సర కాలంగా కమిటీ నియామకంపై ముథోల్ నియోజక వర్గ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చోపచర్చలు జరిగాయి.మాజీ ఎమ్మెల్యేలు బోస్లే నారాయణరావ్ పాటిల్, విఠల్ రెడ్డిలు తమ వర్గీయులకు పాలక వర్గంలో పదవులను కట్టబెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక దశలో మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావ్ పాటిల్ వర్గానికి చెందిన బైంసా మున్సి పల్ మాజీ వైస్ చైర్మెన్ ఓం ప్రకాష్ లడ్డాకు మార్కెట్ కమిటీ చైర్మెన్ స్థానం దక్కనుందని విస్తృత ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటి పటాంపంచలు చేస్తూ బుధవారం పాలక వర్గ కమిటీ నియామకం జరిగింది. కమిటీ చైర్మెన్, వైస్ చైర్మెన్ స్థానాలు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వర్గీయులనే వరించాయి. డైరెక్టర్లుగా సైతం అధికం గా విఠల్ రెడ్డి వర్గీయులకే అవకాశం దక్కినట్లుగా తెలిసింది. డైరెక్టర్లుగా డి.రామేశ్వర్, న డిమిశెట్టి భూమన్న, శేఖ్ మౌళానా, తోట రాము, రాథోడ్ రామ్ నాథ్, జాదవ్ సురేఖ, గడ్పాలే దేవిదాస్, సట్ల కిష్టన్న, మాదవ్ రావ్ , అల్లాపూర్ సుదాకర్ రావ్, కుంటొల్ల విఠల్, కదం దత్తురామ్ లు నియమింపబడ్డారు.