@ ఏర్పాట్లు పూర్తిచేసిన మార్కెటింగ్ అధికారులు
బైంసా, (శ్రీకరం న్యూస్): బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ముహుర్త బలం ప్రకారం పాలక వర్గం ఉదయం 11 గంటలకు మార్కెట్ కమిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక్కడి మార్కెటింగ్ అధికారుల సమక్షంలో పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. బుధవారం నూతన పాలక వర్గ నియామకపు ఉత్తర్వులు వెలువడగా గురువారం ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమయ్యింది. ఎలాంటి హంగు, అర్భాటాలకు తావు లేకుండా కొద్ది మంది అతిథులు, మార్కెటింగ్ అధికారుల సమక్షంలో పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క షెడ్యూల్ ఖరారు అయిన పిదప పాలక వర్గం భారీగా కార్యక్రమాన్ని చేపట్టి అందరి సమక్షంలో మరోమారు ప్రమాణ స్వీకారం, బాధ్యతలు చేపట్టనున్నట్లుగా తెలిసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ సిందే ఆనందావ్ పాటిల్, వైస్ చైర్మెన్ గా ఫారుఖీ ఆహ్మద్, డైరెక్టర్లుగా డి.రామేశ్వర్, నడిమిశెట్టి భూమన్న, శేఖ్ మౌళానా, తోట రాము, రాథోడ్ రామ్నాథ్,జాదవ్ సురేఖ, గడ్ పాలే దేవిదాస్, సట్ల కిష్టన్న, మాదవ్ రావ్ , అల్జాపూర్ సుదాకర్రావ్, కుంటొల్ల విఠల్, కదం దత్తురామ్ పాటిల్ లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.