@ 23 మంది కాంట్రాక్టు ఆధ్యాపకుల పోస్టులు క్రమబద్ధీకరణ పట్ల హర్షం
@ కృతజ్ఞతలు తెలిపిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్
@ ఓకేషనల్ కాంట్రాక్టు పోస్టుల క్రమద్దీకరణకు విజ్ఞప్తి
బైంసా, (శ్రీకరం న్యూస్) ; రాష్ట్రంలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వ హిస్తున్న 23 మంది కాంట్రాక్టు ఆధ్యాపకుల పోస్టులను రేవంత్ రెడ్డి సర్కార్ క్రమబద్దీకరిం చడాన్ని పురస్కరించుకొని తెలంగాణ గజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ సంబరాలు జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం బైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలో టీజీఎల్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కార్గాం వినోద్ కుమార్ సారధ్యంలో అసోసియేషన్ శ్రేణులు ప్రభుత్వానికి కృతజ్ఞత
కార్యక్రమాలను చేపట్టాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేపట్టాయి. క్రమబద్ధీకరణ చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభు త్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీజీఎల్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు కార్గం వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హాయంలో పలువురు కాంట్రాక్టు ఆధ్యాపకులు వివిధ కారణాల తో క్రమబద్ధీకరణకు నోచుకోలేకపోయారని పెర్కొన్నారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వ హయంలో క్రమబద్ధీకరణకు నోచుకోలేని 23 మంది ఆధ్యాపకులను గుర్తించి వారి అర్హతల ఆధారంగా క్రమబద్దీకరించడం ఎంతో శుభపరిణామమని పెర్కొన్నారు. అసోసియేషన్
ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే క్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు పద్దతి న విధులు నిర్వహిస్తున్న ఓకేషనల్ ఆధ్యాపకులను సైతం క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి చేశారు.