@ బైక్ పై వెలుతుండగా వెనుక నుంచి ఢీ కొట్టిన అర్టీసీ బస్సు
@ తల, భుజానికి తీవ్ర గాయాలు
@ ఏరియా ఆసుపత్రిలో చికిత్స
బైంసా, (శ్రీకరం న్యూస్): స్వర్ణకార సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కలికోట రాములు (70) రోడ్డు ప్రమాదం బారిన పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. మంగళవారం ఉదయం వేళలో వ్యక్తిగత పనుల నిమిత్తం బైంసా నుంచి మాటేగామ్ వైపు బైక్ పై వెలుతుండగా ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మార్గంలోని ఎస్ఆర్ మోటార్స్ వైపు మరల తున్న కలికోట రాములు బైక్ ను వెనుక వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. బస్సు ఢీ కొట్టడంతో కలికోట రాములు బైక్ పై నుంచి కింద పడటంతో తల, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి ప్రాంత వాసులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని వైద్య సేవల నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహింప చేశారు. ఆర్టీసీ బైంసా బస్సు డిపో అధికారులు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కలికోట రాములును పరామర్శించి ప్రమాద ఘటన వివరాలు, కారణాలు అడిగి తెలుసుకున్నారు.