– బీజేపీ సభ్యత్వంలో బీజేవైఎం ప్రతినిధి గంగాప్రసాద్ రికార్డు
– ముథోల్ నియోజకవర్గంలో మూడో స్థానం
– అగ్ర నాయకులచే ప్రశంసలు.. అభినందనలు..
భైంసా (శ్రీకరం న్యూస్) ;
బీజేపీ సాధారణ సభ్యత్వ ప్రక్రియలో భైంసా మండల బీజేవైఎం ఉపాధ్యక్షులు గంగాప్రసాద్ రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేస్తూ పార్టీ శ్రేణులచే శభాష్ అనిపించుకుంటున్నాడు. ముథోల్ నియోజకవర్గ పరిధిలోనే సాధారణ సభ్యత్వాల్లో 521 సభ్యత్వాలను నమోదు చేసి పార్టీ అగ్ర నాయకులచే ప్రశంసలు, అభినందనలు అందుకున్నాడు. భైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన గంగాప్రసాద్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బీజేపీ బలోపేతానికి బాధ్యతాయుతంగా కృషి చేస్తున్నాడు. భైంసా పట్టణంలోని ఒక ప్రైవేటు ఏజెన్సీలో సేల్స్ బాయ్ గా పని చేస్తూనే పార్టీ పటిష్ఠతకు పాటు పడుతున్నాడు. ఒక వైపు సేల్స్ బాయ్.. మరో వైపు బీజేవైఎం ప్రతినిధిగా రెండు పదవులను అలవోకగా నిర్వహిస్తూ అందరిచే మన్ననలు పొందుతున్నాడు. ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు వీరాభిమానిగానున్న గంగాప్రసాద్ అన్నింటా కాషాయ జెండా రెపరెపలాడించడమే తన శ్వాస, ద్యాసగా పెట్టుకొని అందుకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నాడు. పార్టీలోని సీనియర్లు ఎందరో సాధారణ సభ్యత్వాల్లో వెనుకబడుతుండగా యువకుడైన గంగాప్రసాద్ క్షేత్ర స్థాయిలో విస్తృత పర్యటనలు చేపడుతు సభ్యత్వాల నమోదులో రికార్డు నమోదు చేసుకుంటున్నాడు. గంగాప్రసాద్ పని తీరును మెచ్చుకున్న ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గెడం నగేష్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండేల లక్ష్మీనారాయణా, జిల్లా అధ్యక్షులు అంజూకుమార్ రెడ్డిలు ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.