* 150 మందికి పైగా కస్టమర్ల 350 పైగా దుస్తుల జతలు దగ్ధం
భైంసా, (శ్రీకరం న్యూస్): రెవెన్యూ డివిజన్ కేంద్రమైన బైంసాలోని పాత సినిమా టాకీస్ సమీపంలో గల సాయిరాణి డ్రై క్లినింగ్ అండ్ ల్యాండ్రీ షాపులో సోమవారం అర్థరాత్రి వేళలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ఘటనలో ల్యాండ్రీ షాపులో డ్రై క్లినింగ్, ఐరన్ ( ఈస్త్రీ ) చేయించేందుకు 150 మందికి పైగా కస్టమర్లు అందించిన 350 పైగా దుస్తులు జతలు దగ్ధమయ్యాయి. వీ టితో పాటు ల్యాండ్రీ షాపులోని ఫర్నిచర్ తో సహ ఇతర సామాగ్రి దగ్ధమయ్యి ఎందుకు పనికి రాకుండా పోయాయి. సంబంధిత అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ల్యాండ్రీ షాపు యజమాని సంటోళ్ల అనిల్ ఘటన స్థలికి చేరుకొని అందుబాటులో ఉన్న వనరుల ద్వారా మంటలను అర్పివేసేందుకు చర్యలు చేపట్టాడు.ఇదే సమయములో ప్రమాద సమాచారాన్ని అగ్నిమాపక శాఖకు అందించగా పైర్ ఇంజన్ తో వచ్చిన సిబ్బంది మంటలను అర్పివేసారు. అప్పటికే ల్యాండ్రీ షాపులోనున్న దుస్తులతో పాటు ఫర్నిచర్, ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి.