Srikaram News
తెలంగాణరాజకీయం

ప్రాణమున్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతా

# వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుస్తా

# పార్టీ మారుస్తున్నట్లు అసత్య ప్రచారం.

# దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారికి గుణపాఠం నేర్పుతా

• బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్ రావ్ పాటిల్

  • బైంసా, (శ్రీకరం న్యూస్): గొంతులో ప్రాణమున్నంత వరకు తాను బీజేపీలోనే కొనసాగుతానని, ఎలాంటి పరి స్థితుల్లోనూ పార్టీని వీడబోనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్రావ్ పాటిల్ వెల్లడించారు. గురు వారం బైంసాలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత కొంత కాలంగా కొంత మంది తాను పార్టీని వీడుతున్నట్లుగా అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక వర్గం కుట్రపూరిత విధానా లతో తనపై కక్ష్య సాధింపు కొరకు, రాజకీయంగా అణగదొక్కెందుకు ఇలాంటి దుష్ప్రచారాని తెరలేపారని వివ రించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తాను బీజేపీని వీడబోనని స్పష్టం చేశారు. పల్లె పల్లెకు బీజేపీ, గడప గడప కు మోహన్రావ్ పాటిల్ కార్యక్రమం పేరిట నియోజక వర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసానని వివరించారు. ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో మోహన్రావ్ ప్రజా ట్ర స్టును ఏర్పాటు చేసి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. బీజేపీ అధిష్టానం శాసన సభ టికెట్ కేటాయించనప్పటికి పార్టీలోనే కొనసాగుతున్నానని తెలిపారు. ప్రజలతో మమేకమై అన్ని వేళల అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని వెల్లడించారు. ఇదే క్రమంలో రాబోయే శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నానని వెల్లడించారు. బరిలో తప్పక నిలుస్తానని స్పష్టం చేశారు.ఇక నుంచి తాను బీజేపీ పార్టీ మారుతున్నట్లుగా అసత్య ప్రచారానికి పాల్పడిన వారు ఎంతటి వారైన ఉపేక్షించకుండా తగు రీతిలో గుణపాఠం నేర్పుతానని హెచ్చరించారు.

 

0Shares

Related posts

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కోటీశ్వరులు

Srikaram News

బైంసా, ముథోల్ ఆత్మ కమిటీల ఖరారు

Srikaram News

మృతదేహల తరలింపుకు అంబులెన్స్ సమకూర్చిన భైంసా రాజస్థానీయులు

Srikaram News

ప్రైవేట్ విద్యా సంస్థలోని ఉద్యోగులకు రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తా

Srikaram News

తేనెటీగల దాడిలో 8 మంది రైతులకు అస్వస్థత

Srikaram News

తెలుగు భాషాభిమానులను అలరారించిన ఆష్టావధానం

Srikaram News

Leave a Comment