• మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు సైతం
• టీపీసీసీ మహేష్ గౌడ్ సమక్షంలో చేరిక
బైంసా, (శ్రీకరం న్యూస్): ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావ్’ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురు వారం హైదరాబాద్ లో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. బీ జేపీని వీడిన మాజీ ఎంపీ సోయం బాపురావ్ కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పా ర్జీలోకి ఆహ్వనించారు. మాజీ ఎంపీ సోయం వెంట బీఅర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు సై తం కాంగ్రెస్ లో చేరారు. అసిఫాబాద్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు, పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చిన సోయం బాపురావ్, అత్రం సక్కులు అనూహ్యంగా గురువారం తమ తమ పార్టీలకు రాజీనామ చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. మాజీ ఎంపీ సోయం బాపురావ్ పార్టీ మార్పుపై ముథోల్ నియోజక వర్గ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎ న్నికలు సమీపిస్తున్న వేళ మాజీ ఎంపీ సోయం, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కులు కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీకి ప్రయోజనం చేకూరె పరిస్థితులు నెలకొన్నాయి.