# రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల రూపొందించిన ప్రాజెక్టు ఎంపిక
# జిల్లాలోని 18 కేజీబీవీల్లో బైంసా కేజీబీవీకి దక్కిన ఘనత
బైంసా, (శ్రీకరం న్యూస్): విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభు త్వం, విద్యాశాఖ సంయుక్తంగా రెండు రోజుల పాటు నిర్మల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్ స్పైర్ మేళాలో బైంసా కేజీబీవీ విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాలలోని 10వ తర గతికి చెందిన విద్యార్థులు జె.అంకిత, ఎల్.శ్వేతలు రూపొందించిన అవిష్కరణ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యింది. ఆకస్మికంగా వర్షాలు కురిసిన సమయంలో చాప ద్వారా వరి ధాన్యాన్ని కాపాడుకునే విధానం పై విద్యార్థుల చేపట్టిన అవిష్కరణ అం దరి మన్ననలను పొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యింది . బైంసా కేజీబీవీ ప్రిన్సిపల్ అప్పాల జ్యోతి సారధ్యంలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు సీహెచ్ శైలజ గైడ్ టీచర్ గా పాఠశాల విద్యార్థు లు ఇన్ స్పైర్ మేళా లో పాల్గొని అందరూ ఆలోచింపచేసేలా ప్రదర్శన చేపట్టారు. జి ల్లా స్థాయి ఇన్ స్పైర్ మేళాకు మొత్తం 128 ప్రదర్శనలు రాగా వీటిల్లో నుంచి 13 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. ఇందులో బైంసా కేజీబీవీ విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన ఉండటం విశేషం. జిల్లాలో 18 కేజీబీవీ పాఠశాలలు ఉండగా రాష్ట్ర స్థాయి ఇన్ స్పైర్ మేళాకు భైంసా కేజీబీవీ పాఠశాల ఒకటే ఎంపిక కావడం గమనార్హం.