• బైక్- ఎడ్ల బండి ఢీకోట్టుకోవడంతో ఘటన
భైంసా, (శ్రీకరం న్యూస్): మండలంలోని గుండేగాం వంతెనపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్ర మాదంలో మహాగామ్ వాసి ఒకరు దుర్మరణం పాలయ్యారు. గ్రామానికి చెందిన ఎస్.బాలాజీ పాటిల్(48)) స్వంత పనుల నిమిత్తం బైంసాకు వచ్చి రాత్రి వేళలో ద్విచక్ర వాహనం పై తిరిగి స్వగ్రామానికి వెలుతుండగా ఘటన చోటు చేసుకు౦ది. గుండేగాం గ్రామ వంతెన వద్ద ద్విచక్ర వాహనం పై వెలుతున్న ఎస్. బాలాజీ పాటిల్ ఎదురు గా వస్తున్న ఎడ్ల బండిని ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలిసింది. ఇందులో ఎస్. బాలాజీ పాటిల్ తీవ్రగాయాల బారిన పడి ఘటన స్థలిలోనే దుర్మరణం చెందినట్లుగా సమాచారం. మృతుడు బైంసాకు చెందిన ప్రముఖ వ్యాపారి వెంకట్ రావ్ పాటిల్ కు సోదరడు
.