Srikaram News
క్రైమ్తెలంగాణ

ఆర్టీసీ బస్సు ఢీ కొని చికిత్స పోందుతూ వృద్ధుని మృతి

ముథోల్ న్యూ జీపీ సమీపంలో ఘటన

భైంసా (శ్రీకరం న్యూస్) ; నియోజకవర్గ కేంద్రమైన ముథోల్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా వృద్ధుడు ఒకరు చికిత్స పోందుతూ సోమవారం వేకువ జామున మృతి చెందాడు. ముథోల్ నయాబాదీ కాలనీకి చెందిన సృంగారి దత్త (65) ఆదివారం ఉదయం ఇంటి నుంచి బస్టాండ్ కు వెళ్తుండగా, కొత్త గ్రామ పంచాయతీ వద్ద భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని ముందుగా భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం గాను నిజామాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పోందుతున్న వృద్ధుడు దత్త సోమవారం వేకువ జామున వేళలో మృతి చెందాడు. మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముథోల్ ఎస్సై కే. సంజీవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

0Shares

Related posts

మార్గదర్శకంగా ముధోల్ తెలంగాణ ఉద్యమకారుల పోరుబాట

Srikaram News

_అనారోగ్యంతో తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వడ్నపు రాజేశ్వర్ మృతి_

Srikaram News

నాగదేవత ఆలయంలో చోరికి పాల్పడ్డ దొంగల పట్టివేత

Srikaram News

వైకుంఠ రథ్ వాహన డ్రైవర్ విఠలన్న మృతి

Srikaram News

ప్రైవేట్ విద్యా సంస్థలోని ఉద్యోగులకు రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తా

Srikaram News

బాసర గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకుల మృతి

Srikaram News

Leave a Comment