• అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మైన గోపాల్, కోర్వ శ్రీకాంత్ ల గెలుపు
• విజేతలకు ధృవీకరణ పత్రాలను అందచేసిన ఎన్నికల అధికారులు
బైంసా, (శ్రీకరం న్యూస్): రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైంసా వెండి, బంగారు వర్తక సంఘం ఎన్నికలు ఆదివారం పోటాపోటీగా జరిగాయి. దిలవార్ పూర్ మండలంలోని కాల్వ శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ సమీపంలో ఎన్నికలు జరిగాయి. సంఘం ప్రతినిధులు కలికోట రాములు, ఎస్.భూమన్న, అల్లాడి ప్రకాష్, బద్రీ రవీంద్రమూర్తిలు ఎన్నికల అధికారులుగా వ్యవహ రించారు. సంఘ అధ్యక్ష పదవికి మైస గోపాల్, బెజ్జంకి రవి, మాటేగామ్ భోజన్నలు, ప్రధాన కార్యదర్శి స్థానానికి కోర్వ శ్రీకాంత్, రమేష్ లు పోటీ పడ్డారు. ఈ క్రమంలో పోలింగ్ నిర్వహణ అనివార్యంగా మారింది. దీంతో సంఘ ఎన్నికల అధికారులు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఓటింగ్ నిర్వహించారు. ఇందులో అధ్యక్షునిగా మైస గోపాల్, ప్రధాన కార్యదర్శిగా కోర్వ శ్రీకాంత్ లు గెలుపొందారు. విజేతలుగా నిలిచిన మైస గోపాల్, కోర్వ శ్రీకాంత్ లకు ఎన్నికల నిర్వహణ అధికారులు గెలుపు దృవీకరణ పత్రాలు అందచేయగా సంఘ సభ్యులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు.