Srikaram News
క్రైమ్తెలంగాణ

నాగదేవత ఆలయంలో చోరికి పాల్పడ్డ దొంగల పట్టివేత

– నూతన సంవత్సర వేడుకల విందు కోసం చోరీ
– దొంగలిద్దరూ భైంసా మండలం చుచుంద్ వాసులు
– చోరీ చేసిన గుడి గంటల స్వాధీనం
– విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకీ షర్మిలా

భైంసా ( శ్రీకరం న్యూస్) ; భైంసా పట్టణ శివారులోని నాగదేవత ఆలయంలో చోరి ఘటన కేసు 48 గంటల వ్యవధిలో పోలీసులు చేధించారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సీఐ గోపినాథ్ లు సంబంధిత చోరి ఘటన చేధించేందుకు గాను ప్రతిష్ఠాత్మకంగా వ్యవహారించి సత్ఫలితాలు సాధించారు. గురువారం ఉదయం భైంసాలోని ఎస్పీ క్యాంప్ ఆఫీస్ లో జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిలా చోరి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భైంసా మండలం చుచుంద్ గ్రామానికి చెందిన విశాల్, సంఘ రతన్ అనే ఇద్దరు స్నేహితులు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గాను డబ్బులు లేకపోవడంతో చోరి చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే నాగదేవత ఆలయానికి వెళ్లి మందిర తాళం పగులగొట్టి లోనికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీ కానుకలతో పాటు గుడిలోని గంటలను సైతం వీరు చోరి చేశారు. సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసిన భైంసా పట్టణ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా వ్యవహారించి దొంగలను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో దొంగలిద్దరూ ధరించిన దుస్తులకు ఆలయంలోని పసుపు, కుంకుమ అంటుకుంది. అంతే కాకుండా చోరి జరిగిన సమయంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల సమయంలో పట్టణ ప్రవేశ మార్గంలోని సీసీ కెమెరాలన్నింటిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంలో చోరికి పాల్పడ్డిన ఇద్దరిలో ఒకరికి పసుపు, కుంకుమ అంటినట్లుగా గుర్తించి అనుమానితుడి భావించి విచారణ చేపట్టారు. ఆ తర్వాత సంబంధిత వ్యక్తులు ఇద్దరు చోరికి పాల్పడ్డట్లుగా నిర్ధారించి గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 48 గంటల వ్యవధిలో కేసును చేధించిన భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, టౌన్ సీఐ గోపినాథ్ తో పాటు పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకీ షర్మిలా అభినందించారు.

0Shares

Related posts

షార్ట్ సర్క్యూట్ తో ల్యాండ్రీ షాప్ లో అగ్ని ప్రమాదం

Srikaram News

మాజీ డీసీసీ అధ్యక్షుడు దిగంబర్ మాశెట్టివార్ కన్నుమూత

Srikaram News

కుభీర్ మార్కెట్ చైర్మన్ గా జి. కళ్యాణ్

Srikaram News

దిల్లీ పీఠ కైవసంతో భైంసాలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

Srikaram News

నేడు బైంసాలో శ్రీ బద్దిపోచమ్మ విగ్రహా ప్రతిష్టాపనోత్సవం

Srikaram News

కళా ఉత్సవ్ లో నాట్య ప్రదర్శనతో దుమ్మురేపిన భైంసా విద్యార్థినిలు

Srikaram News

Leave a Comment