• అభినందించిన జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల
బైంసా, (శ్రీకరం న్యూస్): సంచలనాత్మకంగా మారిన నాగదేవత ఆలయ చోరి కేసును చేధించిన పోలీసు అధి కారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల అభినందించింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని 48 గంటల 5 వ్యవధిలోనే దొంగలను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, టౌన్ సీఐ గో పినాథ్, ఎస్ఐ శ్రీనివాస్ లను ప్రత్యేకంగా అభినందించింది. ఇదే క్రమంలో కేసు చేధనలో ప్రధాన భాగస్వామ్యాన్ని అందించిన భైంసా టౌన్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ జాదవ్, కానిస్టేబుల్స్ ప్రమోద్ కుమార్, అంబదాస్ లను అభినందించి రివార్డులను అందచేసింది.