– హరిదాసు, గంగిరెద్దుల వేషాధారణలతో ఆకట్టుకున్న చిన్నారులు.
– బోగి మంటల ముందు సందడి
– చిన్నారులకు బోగి పళ్లు పోసిన ఉపాద్యాయులు
– ప్రతిబింబించిన సంస్కృతి, సంప్రదాయాలు
భైంసా,(శ్రీకరం న్యూస్) సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బైంసా పట్టణంలోని శ్రీ గౌతమి హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి పర్వదిన వేడుకలు ఆధ్యాంతం ఆచార వ్యవహారాలకు అనుగుణంగా కో నసాగాయి. ఉదయం వేళ నుంచి సాయంత్రం వరకు కొనసాగిన వేడుకల్లో పర్వదిన ప్రాముఖ్యత, విశిష్టత తెలియచేసేలా కార్యక్రమాలు కొనసాగాయి. బోగి మంటలు వేయడు, ఇళ్ల ముందు గొబ్బేమ్మలు మొదలు కొని నోము ప్రత నిర్వహణ వరకు కార్యక్రమాలు చేపట్టారు. గంగిరెద్దు, హరిదాసుల వేషాధారాణలతో చిన్నారులు నిర్వహించిన ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. మహిళా ఉపాధ్యాయ బృందం పర్వదిన వేడుకల్లో నిర్వహించే కార్యక్రమాలను ఆచరించుకునేలా చేపట్టారు. కట్టెల పొయ్యిపై పాలు పొంగించడం, చిన్నారులకు భోగి పండ్లు పోయడం, ఇళ్ల ముందు ముగ్గులు వేయడము. సంక్రాంతి నోము లాంటి కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా చేపట్టి విద్యార్థులకు అవగాహన కల్పించారు. భోగి మంటలు ముందు సందడి చేస్తూ విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు, చేపట్టిన నృత్యాలు వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా శ్రీ గౌతమి హైస్కూల్ కరస్పాండెంట్ రేగుంట రవి, సలహదారుడు పల్లికొండ బాలాజీ, అకాడమిక్ సలహదారుడు వినాయక్ రావ్ లు మాట్లాడుతూ పర్వదినాల ప్రాముఖ్యత, విశిష్టతలపై ప్రతి విద్యార్థి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సంస్కృతి, సంప్రదాయలు, ఆచార వ్యవహరాలకు అనుగుణంగా పర్వదిన వేడుకలను ఆనందోత్సహల మధ్య భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.