– చొరవ చూపిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ముధోల్ ఎం ఎల్ ఎ పాటిల్
– అక్కడి కలెక్టర్, ఎస్పీతో మాట్లాడిన ముథోల్ ఎమ్మెల్యే రామరావ్ పాటిల్
– యాత్రీకులను క్షేమంగా తరలించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి
– సానుకూలంగా స్పందించిన వృందావన్ అదికార గణం.
– వాహనాల ద్వారా తరలించేందుకు ప్రారంభమైన చర్యలు
బైంసా, (శ్రీకరం న్యూస్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వృందావన్. క్షేత్రంలో బస్సు అగ్ని ప్రమాదం బారిన పడటంతో అక్కడ చిక్కుకున్న బైంసా డివిజన్ యాత్రీకులను స్వస్థలాలకు, సురక్షితంగా రప్పించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పాటిల్ మంగళవారం రాత్రి ఘటన చోటు చేసుకున్న వృందావన్ క్షేత్ర కలెక్టర్, ఎస్పీతో ‘ఫోన్ ద్వారా మాట్లాడి యాత్రీకుల యోగా క్షేమాలు తెలుసుకున్నారు. యాత్రీకులను సురక్షితంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అగ్ని ప్రమాదంతో కట్టుబట్టలతో బయట పడ్డ యాత్రీకులకు అవసరమైన సహయ సహకారాలు అందించి ఇక్కడకు తరలించాలని కోరారు. అప్పటి వరకు యాత్రీకులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించి ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అక్కడి అధికార గణం సానుకూలంగా స్పందించినట్లుగా తెలిసింది. బుధవారం యాత్రీకులను బైంసా వరకు తరలించేందుకు గాను అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లుగా అక్కడి అధికారులు ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పాటిల్ సమాచారం అందించినట్లుగా తెలిసింది. వాహనాలను సమకూర్చి రోడ్డు మార్గం ద్వారా వారిని బైంసాకు తరలించనున్నట్లుగా సమాచారం. దీనికి తోడు ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పాటిల్ సంబంధిత ప్రమాద ఘటన, అక్కడ చిక్కుకున్న యాత్రీకుల వి వరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయానికి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి సైతం తీసుక వెళ్లినట్లుగా తెలిసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడి అధికారులతో సంబంధిత విషయంలో మాట్లాడి యాత్రీకుల తరలింపుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్టుగా తెలిసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్. ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పాటిల్ చొరవతో యాత్రీకుల తరలింపుకు చర్యలు వేగవంతమయినట్లు గా తెలిసింది.