* ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ బిక్షాటనతో నిరసన
• ఆధ్యాపకులకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీ
• ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ నిధుల విడుదల డిమాండ్
భైంసా, (శ్రీకరం న్యూస్): పెండింగ్ లో నున్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల విడుదల చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతి రేకిస్తూ భైంసాలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వాహకులు, ఆధ్యాపకులు భిక్షాటన చేపట్టి తమ నిరసనను వ్యక్తపరించారు. గత కొంత కాలంగా పెండింగ్ నిధుల విడుదల కోసం కళాశాలల నిరవధిక బంద్ తో పాటు వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవస్తున్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వాహకుల ఆద్యాపకులు వినూత్న నిరసన చేపట్టారు. భైంసాలోని ప్రధాన రోడ్డు మార్గాల్లో సంచరించి వ్యాపార సముదాయాల్లోకి వెళ్లి భిక్షాటన చేపట్టారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం మూలంగా తమ బతుకులు రోడ్డున పడ్డాయని తెలియచెప్పెలా వారందరూ భిక్షాటనకు పూనుకున్నారు. ప్రభు త్వం ఇకనైనా స్పందించి పెండింగ్ లో నున్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ నిధులను విడుదల చేయాలని వేడుకుంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వాహకులు, ఆద్యాపకులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీలు చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్. స్కాలర్షిప్స్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఒక వైపు విద్యార్థుల ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ, మరో వైపు ఆధ్యాపకులు. కళాశాలల నిర్వాహకుల భిక్షాటనతో చేపట్టిన నిరసనలు ఫీజు రీం సుంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల అవశ్యకతను ప్రస్పుటింప చేశాయి.