– భైంసా కేంద్ర కౌన్సిలర్ విలాస్, ల్యాబ్ టెక్నిషియన్ తోపిక్ లకు పురస్కారం
– హైదరాబాద్ లో అవార్డులు ప్రధానం చేసిన ఎయిడ్స్ కంట్రోల్ సోసైటి పీడీ, ఏపీడీ
భైంసా, (శ్రీకరం న్యూస్), రెవెన్యూ డివిజన్ కేంద్రమైన బైంసాలోని ఏరియా ఆసుపత్రిలో కొనసాగుతున్న ఇంటిగ్రేటేడ్ కౌన్సిలింగ్ అండ్ ట్రెయినింగ్ (ఐసీటీసీ) కేంద్రానికి టీజీఎస్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును ప్రధానం చేసింది. ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఐసీటీసీ కేంద్రం ద్వారా వ్యాధి నియంత్రణపై ప్రజలను చైతన్యపరచడం, నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయడం, సోచ్ నమోదు, వ్యాధి బాధి తులకు జీవితముపై భరోసా కల్పించేలా చర్యలు చేపట్టడం లాంటి కార్యక్రమాలన్నింటిని పరిగణలోకి తీసుకొని అవార్డు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డా.కాశీనాథ్ సారధ్యంలోని ఐసీటీసీ కౌన్సిలర్ విలాస్, ల్యాబ్ టెక్నిషియన్ తోపిక్ లు సహచర సిబ్బందితో సమిష్టిగా కృషి చేసి బైంసా ఐసీటీసీ కేంద్రం ద్వారా బాధ్యతాయుతమైన విధానాల ద్వారా అంకితభావంతో విధులను చేపట్టి టీజీఎస్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లక్ష్యాలను పూర్తి చేయడం, పనితీరులో పరిణతిని ప్రదర్శించి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో బాగంగా ఆదివారం హైదరాబాద్ లోని వెంగళ్ రావ్ నగర్ కాలనీ పరిధిలో గల ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో బైంసా ఐసీటీసీ కేంద్ర కౌన్సిలర్ విలాస్, ల్యాబ్ టెక్నిషియన్ తోఫిక్ లు అవార్డులను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ హైమవతి. అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్ చేతుల మీదుగా, విలాస్, తోఫిక్ లు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డుతో పాటు ప్రశాంస పత్రాలను స్వీకరించారు.