• నేత్ర పర్వంగా విగ్రహ ప్రతిష్టాపనోత్సవం
• శాస్త్రోక్తంగా చండీహోమం, పూర్ణహూతి
• భారీగా తరలివచ్చిన భక్తజనులు
బైంసా, (శ్రీకరం న్యూస్), వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల కోలాహలం మధ్య బైంసాలోని భట్టిగల్లి బద్ది పోచమ్మ ఆలయంలో అమ్మవారు కొలువుదీరారు. మూడు రోజులుగా అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపనోత్సవాలు ఆధ్యాంతం నేత్రపర్వంగా కొనసాగాయి. సోమవారం వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమాలను చేపట్టారు. రెం డు రోజులుగా అమ్మవారికి జల, దాన్య, శయ దివాస్ పూజలను చేపట్టిన పండితులు సోమవారం ఉదయం ఆలయం లోని గద్దెపై అమ్మవారికి ప్రతిష్టాపన పూజలను చేపట్టారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన బద్ది పోచమ్మ తల్లికి కాలనీ మహిళలు శోభయమానంగా అలంకరించారు. తొలి పూజలను విగ్రహదాత వడ్నపు రాజేశ్వర్ దంపతులు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో పూర్ణహుతి చేపట్టారు.ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పాటిల్ తో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు.
• భారీగా తరలివచ్చిన భక్తజనం…..
అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హజరయ్యారు. బద్దిపోచమ్మ ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయి కనిపించాయి. భట్టిగల్లి, గణేష్ నగర్ కాలనీలన్నీ భక్తులతో జనసంద్రంగా మారిపోయాయి. విగ్రహ ప్రతిష్టాపన సమయంలో అమ్మవారి నామ స్మరణ చేపడుతూ భక్తులు పరవశించిపో యారు. పట్టణ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వేడుకలకు హజరయ్యారు. ప్రతిష్టాపనోత్స వాలు ముగిసిన అనంతరం ఆలయ కమిటీ భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టింది.