* యూనియన్ జిల్లా అధ్యక్షుడు నరేంద్రబాబు
* మనంగా యూనియన్ అవిర్భావ దినోత్సవ వేడుకలు
* పదవీ విరమణ పొందిన యూనియన్ శ్రేణులకు సన్మానం
బైంసా, (శ్రీకరం న్యూస్): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పీఆర్టీయూ సంఘంతోనే సాధ్యమని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నరేంద్రబాబు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన నిర్మల్ లోని పీఆర్టీయూ భవనంలో యూనియన్ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సంక్షేమమే ప్రధాన ఎజెండా గా 1971 లో సంఘము అవిర్భావిందని గుర్తు చేశారు. ఆ నాటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. యూనియన్ ప్రాతినిధ్యంతో పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పెన్షన్, హెఅర్ఎ అలవెన్స్ తో పాటు ఇతర సౌకర్యాలను సాదించుకోవడం జరిగిందన్నారు . ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ద్వారా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పీజీ హెచ్ఎం, ఎంఈవో, డీవైఈవో, జెఎల్, డైట్ లెక్చరర్స్ పదోన్నతులను ఇప్పించిన మనత సంఘానిదేనన్నారు. పండిత్, పీఈటీల అప్ గ్రేడేషన్ , చైల్డ్ కేర్ లీవ్ పీఆర్సీ బకాయిలు, సకల జనుల సమ్మె, అర్జిత సెలవులు, హెల్త్ కార్డులు సాదించడంలో సంఘం ప్రధాన పాత్ర పోపించిందని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోసం యూనియన్ ఆధ్వర్యంలో అంకితభావంతో కృషి చేస్తున్నట్లుగా వెల్లడించారు. సంఘ ప్రతినిధులందరూ బాధ్యతాయుతమైన విధానాల ద్వారా యూనియన్ పటిష్టతకు చిత్తశుద్దితో వ్యవహరించాలన్నారు. ప్రణాళికబద్ధమైన విదా నాల ద్వారా సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది బలోపేతం చేయాలన్నారు. యూనియన్ ప్రతినిధులు మార్గదర్శకమైన తీరుతో ఉపాద్యాయ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి సంఘం ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పరష్కరించుకొని యూనియన్ జెండాను ఎగురేసి, సంఘం కోసం పనిచేసిన 8 మంది విశ్రాంత కార్యకర్తలకు యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇందులో యూనియన్ ప్రతినిదులు బల్ప గజ్జారాం, కె.మోహన్, పరమే శ్వర్ రెడ్డి, సిద్ధిరామ్, విజయ్ కుమార్, సదానందం, కె.శంకర్, భూమారెడ్డి, కృష్ణ, శేఖర్, రఘునాధ్, పరమేశ్వర్, రాజన్న, చింతమోహన్, రాజన్న, గంగాచరణలతో పాటు పలువురు పాల్గొన్నారు.