– పుస్తకంరూపంలో ఉద్యమకారుల చరిత్ర
– కళ్ళకు కట్టినట్లు రూపొందించిన తెలంగాణ తెలుగు కళా నిలయం రచయితలు
– పుస్తకాన్ని అవిష్కరించిన ఎమ్మెల్యే రాంరావ్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
– రచయితలను అభినందించి సన్మానాలు చేసిన ప్రముఖులు
భైంసా (శ్రీకరం న్యూస్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని రీతిలో, అవిశ్రాంతంగా పోరుబాట కొనసాగించిన ముధోల్ నియోజక వర్గ ఉద్యమకారుల చరిత్రను తెలంగాణ తెలుగు కళా నిలయం రచయితలు పుస్తక రూపం తెచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల పోరం జిల్లా అధ్యక్షుడు డా. రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జాదవ్ పుండలీక్ రావ్ పాటిల్ సారధ్యంలోని పలువురు రచయితల బృందం వస్తకాన్ని రూపొందించింది. శనివారం ముబోల్ పవర్ రామారావు పాటిల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు ఉద్యమకారుల చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పవార్ రాంరావ్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డా. దామోదర్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ సిందే ఆనంద్ రావ్ పాటిల్ తో పాటు పలువురు మాట్లాడారు. దశాబ్ద కాలం క్రితం ముదోల్ నియోజక వర్గ ప్రాంతానికి చెందిన ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మార్గదర్శకమైన రీతిలో ఉద్యమించి పోరుబాట కొనసాగించారని పేర్కొన్నారు. నియోజక వర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాలవాసులు చేపట్టిన ఆదర్శవంతమైన పోరుబాటలు అన్ని ప్రాంతాలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఇక్కడి ఉద్యమకారుల పోరుబాటను ఇతర ప్రాంతాలవాసులు మార్గదర్శకంగా తీసుకొని ఉద్యమించారంటే మన ప్రాంతవాసుల పోరుబాట బాట ఎంతటి ప్రభావం చూపిందో చెప్పకుండానే తెలిసిపోతోందన్నారు. తామార్ మండలములోని బోసి వాసులతో పాటు పలు ప్రాంతాలవాసులు అమరణ నిరాహార దీక్షలతో ఉద్యమం తీవ్రతరమయ్యిందన్నారు. అన్ని వర్గాల సమిష్టి కృషితో సకల జనుల సమ్మె ఉదృతంగా జరిగిందన్నారు. పలు ప్రాంతాల ఉద్యమకారులు
చేపట్టిన ఆందోళనలు, నిరసనలు ప్రభుత్వాన్ని కదిలింప చేయడంలో భాగస్వామ్యాన్ని అందించాయన్నారు. కొంత మంది ప్రత్యేక రాష్ట్రం కోసం గాను ప్రాణాలను త్యాగం సైతం చేసాదని గుర్తు చేస్తూ అవేదన వ్యక్తం చేసారు. ఎందరో మంది పై పోలీసు కేసులు నమోదయ్యి కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి ప్రదక్షిణలు చేసారని పేర్కొన్నారు. కొంత మంది పోలీసుల దెబ్బల బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారని పేర్కొన్నారు. ఇంకొంత మంది జైలు జీవితం కూడా అనుభవించారని వివరించారు. ఇలాంటి ఉద్యమకారుల పోరుబాటను పుస్తక రూపంలో తీసుకరావడం అభినందనీయమన్నారు. తెలంగాణ తెలుగు కళా నిలయానికి చెందిన జాదవ్ పుండలీకరావ్ పాటిల్, సోమ జనార్దన్ రెడ్డి, కడారి దశరథ్. పీసర శ్రీనివాస్ గౌడ్ (ఆంధ్రజ్యోతి, పాత్రికేయుడు), బసవరాజులు సమిష్టిగా కృషి చేసి సమన్వయంతో వ్యవహరించి ఉద్యమకారుల చరిత్రను కళ్లకు కట్టినట్లుగా రూపొందించారని కితాబునిచ్చారు. నాటి ఉద్యమకారులు పోరుబాట ఎంతటి ఆదర్శంగా మార్గదర్శకంగా కొనసాగిందో పుస్తకంలో పొందుపరచారని తెలిపారు. ముధోల్ నియోజక వర్గ ఉద్యమకారుల పోరాట పటిమను, త్యాగాలను, అంకిత భావాలను భావి తరాలకు స్పూర్తిని కలిగించేలా చరిత్ర రూపంలో పుస్తకం రూపొందించబడిందన్నారు. ఉద్యమకారుల పోరుబాట, ఉద్యమ తీరును పుస్తకం ప్రస్పుటింప చేసిందన్నారు. పుస్తకాన్ని రూపొందించిన తెలంగాణ ఉద్యమకారుల పోరం జిల్లా అధ్యక్షులు డా. ముష్కం రామకృష్ణగౌడ్, తెలంగాణ తెలుగు కళా నిలయం ప్రతినిధులు జాదవ్ పుండలికు రావు పాటిల్ , సోమ జనార్ధన్ రెడ్డి, కడారి దశరథ్, పిసర శ్రీనివాస్ గౌడ్, బసవరాజులను అభినందించారు. పుస్తక అవిష్కరణలో పాల్గొన్న రచయితలను అభినందించి ఘనంగా సన్మానించారు. ఇందులో జేఏసీ ప్రతినిధులు రవి పాండే, జాదవ్ రాజేష్ బాబాబు, గిరిధరి జంగ్మే, గౌతం పింగ్లే, సోలంకి బీంరావ్ పటేల్, బోస్లే పండిత్ రావ్ పాటిల్ , పప్పాల పీరాజీ,చాకేటి లస్మన్నతో పాటు
ముదోల్ నియోజక వర్గ పరిధిలోని ఆయా ప్రాంతాల ఉద్యమకారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు
యువజన సంఘాల శ్రేణులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు.