@ పట్టభద్రులతో ప్రతి రోజు బేటి అవుతున్న ఎన్నికల కన్వీనర్ బండారి దిలీప్
@ ఉపాధ్యాయులతో మమేకమవుతున్న ఎన్నికల కో కన్వీనర్ కాసరోళ్ల ప్రవీణ్
@ పార్టీ అభ్యర్థులిద్దరి గెలుపు కోసం అవిరళంగా కృషి చేస్తున్న ఇంచార్జీలిద్దరు
బైంసా, (శ్రీకరం న్యూస్): అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులిరువురి గెలుపు కోసం భైంసా పట్టణ బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జీలిద్దరు అవిరళంగా కృషి చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ బండారి దిలీప్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కో కన్వీనర్ కాసరోళ్ల ప్రవీణ్ లు ప్రణాళికబద్ధమైన విదానాల ద్వారా అలుపెరుగని రీతిలో అవిశ్రాంతంగా ప్రచార పర్వాన్ని చేపడుతున్నారు. పక్షం రోజులకు పైగా కాలం నుంచి ప్రతి నిత్యం ఉదయం వేళలో వాకర్స్ తో బేటీ జరిపి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుడుతున్న వీరిద్దరు రాత్రి వరకు ప్రచారాన్ని కొన సాగిస్తున్నారు. ఇంచార్జీలిద్దరు సమన్వయంతో వ్యవహరిస్తూ, సమిష్టిగా కృషి చేస్తూ ప్రచార పర్వాన్ని మార్గదర్శకంగా చేపడుతున్నారు. ఎన్నికల ఓటరు జాబితాకు అనుగుణంగా పట్టణ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రణాళికబద్ద మైన విధానాల ద్వారా, పకడ్బందీ చర్యలతో పార్టీ అభ్యర్థులిద్దరి గెలువు కోసం అహర్నిషలు కృషి చేస్తు న్నారు పట్టణ పరిధిలోని పట్టభద్రులతో ఎన్నికల కన్వీనర్ బండారి దిలీప్ క్రమం తప్పకుండా వరుస బేటీలు జరుపుతూ పార్టీ అభ్యర్థి అంజి రెడ్డికి వారి మద్దతు కూడగట్టెందుకు బాధ్యతాయుతంగా పాటుపడుతున్నాడు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కో కన్వీనర్ కాసరోళ్ల ప్రవీణ్ నిత్యం ఉపాధ్యాయ ఓటర్లతో మమేకమవుతూ వారి ఓట్లను పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొముయ్యకు దక్కింప చేసేందుకు గాను ప్రణాళికబద్దంగా కృషి గావిస్తున్నాడు. ఇంచార్జీలిద్దరు బీజేపీ పట్టణ కమిటీ ప్రతినిధులతో పాటు ఆయా వార్డులలో పార్టీ శ్రేణులు, బూత్ కమిటీలు, ప్రబారీలతో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్సీ ఎన్ని కల ప్రచారాన్ని ఆదర్శవంతమైన రీతిలో మార్గదర్శకంగా చేపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జీలిద్దరి కృషితో బైంసా పట్టణ పరిధిలో బీజేపీ ఎన్నికల ప్రచారం పర్వం జోరుగా… హుషారుగా కొనసాగుతూ పటిష్టవంతంగా కొనసాగుతోంది.