– ప్రధాన అభ్యర్థి ఒకరు ఓటుకు రూ.5 వేల తాయిలం
– ఉపాధ్యాయ సంఘం అభ్యర్థి ఒకరు ఓటుకు రూ.3 వేల నజరాన
– ప్రత్యక్ష, పరోక్ష విధానాల్లో కవర్లలో నగదు పంపిణీ..
– జిల్లాలో 1,966 మంది ఉపాధ్యాయ ఓటర్లు
బైంసా, (శ్రీకరం న్యూస్), మరో రెండు రోజుల వ్యవధిలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం కొన్ని గంటల వ్యవధిలో ముగియనుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం గాను అన్ని రకాల చర్యలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు ప్రధాన అభ్యర్థులు గెలుపు కోసం ప్రలో భాల పర్వానికి తెరలేపారు. అస్త్ర శస్త్రలను సందిస్తున్నారు. ఓటర్లను అకట్టుకునేలా…వారి ఓట్లను దక్కించుకునేలా చ ర్యలు చేపట్టారనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. రెండు రోజులుగా ఇద్దరు అభ్యర్థుల అనుచరగణం ఓటర్లను ప్రత్యక్ష,పరోక్ష విధానాల ద్వారా ప్రసన్నం చేసుకునే చర్యలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ప్రధాన అభ్యర్థి ఒ కరు తమ పార్టీకి సంబంధం లేకుండా నేరుగా తన అనుచర గణాన్ని ఉపాధ్యాయ ఓటర్ల వద్దకు పంపించి వారికి నగదు రూపంలో తాయిలం అందిస్తున్నట్లుగా తెలిసింది. సంబంధిత అభ్యర్థి ఓటుకు రూ. 5 వేలు చొప్పున నగదు పం పిణీని పూర్తి చేసినట్లుగా తెలిసింది. ఒక ఉపాధ్యాయ సంఘం అభ్యర్థి తన యూనియన్ బాధ్యుల ద్వారా ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేయించినట్లుగా సమాచారం. ఇద్దరు అభ్యర్థులు కవర్లలో నగదును పెట్టి ఉపాధ్యాయ ఓ టర్లకు అందిస్తున్నట్లుగా తెలిసింది. కాగా జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 1,966 మంది ఓటర్లు ఉం డగా వీరి కోసం గాను 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.