– మహిళ కడుపులో నుంచి 6 కిలోల కణితి తొలగింపు
– శస్త్ర చికిత్స నిర్వహించిన డా. అపూర్వ రజనీకాంత్, డా.ప్రీతి
భైంసా, (శ్రీకరం న్యూస్).
తీవ్రమైన కడుపునొప్పితో అస్వస్థత చెందిన మహిళ ఒకరికి బైంసా ఏరియా ఆసుపత్రి వైద్య బృందం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ముధోల్ మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన చిన్నమ్మ (58) అనే మహిళ తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది తదితర అనారోగ్యపు సమస్యలతో ఆ స్వస్థత చెందింది. కుటుంబ సభ్యులు బాధిత మహిళను మూడు రోజుల క్రితం భైంసాలోని ఏరియా ఆసుపత్రికి వైద్య సే వల నిమిత్తం ఇన్ పేషెంట్ విభాగములో చేర్పించారు. సదరు మహిళకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు బృందం బాధిత మహిళ కడుపులో 6 కిలోల బరువున్న కణితిని గుర్తించారు. గురువారం ఏరియా ఆసుపత్రి వైద్యాధికారిణుల బృందం డా. ఆ పూర్వ రజనీకాంత్, డా. ప్రీతిల నేతృత్వంలో బాధిత మహిళకు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. రెండున్నర గంటలపాటు కొనసాగిన శస్త్ర చికిత్సలో బాధిత మహిళ కడుపులో గల 6 కిలోల కణితిని తొలగించారు. శస్త్ర చికిత్స విజయవంతంగా చేపట్టామని, బాధిత మహిళ త్వరలోనే కొలుకోని ఆరోగ్యంగా డిశ్చార్జీ అవుతుందని వైద్యాధికారిణుల బృందం వెల్లడించింది. అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్య బృందాన్ని ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డా. కాశీనాథ్ అభినందించారు.