* కన్నతల్లి కళ్ల ముందే మృతి చెందిన కుమారులు
* మృతదేహలపై పడి రోదిస్తూ సొమ్మసిల్లిన తల్లి
– కుటుంబానికి తీరని శోకం మిగిల్చిన బాసర యాత్ర
బైంసా, (శ్రీకరం న్యూస్), బాసర గోదావరి నదిలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న దుర్ఘటనలో హైదరాబాద్ చెందిన ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు సొంత అన్నదమ్ములున్నారు. హైద రాబాద్ loni దిలుశుక్నగర్ ప్రాంతంలోని చింతల్ ఏరియాలో నివాసముంటున్న రాజస్థానీయులు రాథోడ్ ప్రేమ్ లాల్, సోను దంపతులకు ముగ్గురు కుమారుల. ఒక కుమార్తె ఉన్నారు. ఆదివారం సోను తమ ముగ్గురు కుమా రులు రాకేష్, భరత్, మదన్ తో పాటు కుమార్తెను తీసుకొని బంధువులతో కలిసి అమ్మవారి దర్శనం కోసం గాను బా సరకు వచ్చింది. ఇందులో భాగంగానే బంధువులతో కలిసి సోను, ఆమె ముగ్గురు కుమారులు. కుమార్తె గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వెళ్లారు. అయితే అక్కడి గోదావరి నదిలోని లోతైన ప్రదేశం తెలియక ఐ దుగురు యువకులు స్నానాలు ఆచరించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యుపడ్డారు. ఇందులో సోను ముగ్గురు కుమారులున్నారు. ఆందరి కళ్ల ముందే యువకులు స్నానానికి వెళ్లి మృతి చెందారు. బంధువు లంతా నీట మునుగుతున్న వారిని కాపాడండి అంటూ ఆర్తనాదాలు పెట్టినప్పటికి ఫలితం లేకుండా పోయింది. తన కళ్ల ముందే ముగ్గురు కుమారులు కోల్పోయిన తల్లి రోదిస్తున్న తీరు అందరిని కంట తడి పెట్టించింది. బైంసా ఏరియా ఆసుపత్రిలో ముగ్గురు కుమారుల మృతదేహాలను చూస్తూ సోను ఒక్కసారి కుప్పకూలి సోమ్మసిల్లి పోయింది. బందువులు, పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది సొమ్మసిల్లిని సోనుకు సపర్యలు చేశారు. మూడు మృత దేహలపై పడి సోను కన్నీరుమున్నీరై విలపించింది. అవేదన భరితురాలైన సోను ముగ్గురు కుమారులను కోల్పోయిన తాను బ్రతికి వృదా అంటూ అసుపత్రి నుంచి బయటకు వచ్చి ఎదైనా వాహనం కింద పడి ప్రాణాలు తీస కుంటానంటూ వెలుతుండగా బంధువులు గుర్తించి సముదాయించి తిరిగి ఆసుపత్రికి తీసుకవచ్చారు.