– బాసర దుర్ఘటన మృతదేహలకు పోస్టుమార్టం పూర్తి
– ఒక మృతదేహం హైదరాబాద్ కు
* మిగతా నాలుగు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినది
బైంసా, (శ్రీకరం న్యూస్): బాసర గోదావరి నదిలో చోటు చేసుకున్న దుర్ఘటనలోని మృతదేహలకు ఆదివారం సాయంత్రం భైంసాలోని ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్హం పూర్తయ్యింది. ఐదుగురు యువకులు మృతి చెందగా ఇందులో నుంచి రితిక్ అనే యువకుని మృతదేహాన్ని అంత్యక్రియల కోసం గాను హైదరాబాద్ లోని దిల్శుక్ నగర్ తరలించారు. మిగతా నలుగురి మృతదేహాలు అంత్యక్రియల కోసం గాను రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జి ల్లా కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో వారి స్వగ్రామానికి తరలించారు. కాగా బైంసాలో నివాసముంటున్న రా జస్థానీయులు మృతుల కుటుంబాలకు ఇక్కడ అన్నీ తామే అయి సహకరించారు. మృతదేహలు ఇక్కడికి వచ్చిన సమాచారం అందుకున్న స్థానిక రాజస్థానీయులు అధిక సంఖ్యలో ఆసుపత్రికి తరలివచ్చారు. బాధితులకు అవస రమైన అన్నీ రకాల సహాయ,సహకారాలు అందించారు. పోస్టుమార్టం పూర్తయిన పిదప మృతదేహాలు హైద రాబాద్, రాజస్థాన్ తరలించేందుకు గాను అంబులెన్స్ వాహనాలను సమకూర్చారు.రోదిస్తూ కుప్పకూలిన పలువురు మృతుల కుటుంబీకులకు వైద్య సేవలు అందింప చేయడంతో అన్ని రకాలుగా తోడ్పాటునిచ్చారు. సుదూరం లోనున్న రాజస్థాన్ కు తరలుతున్న అంబులెన్స్ తో పాటు ఇతర వాహనాలలో వాటర్ బాటిళ్లు, బిస్కట్లు, ఓఆర్ఎస్ లిక్విడ్ పాకెట్లతో పాటు పండ్లు సైతం సమకూర్చారు. |